![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -857 లో.. కాలేజీ స్టాఫ్ కి సాలరీలు ఇంకా పడలేదని తెలుసుకున్న జగతి వెంటనే మేనేజర్ తో మాట్లాడుతుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటని అడుగుతుంది. ఎమో మేడం తెలియదని మేనేజర్ చెప్తాడు. అప్పుడే ఫణింద్ర , శైలేంద్ర ఇద్దరు వస్తారు. ఏమైందని ఫణింద్ర అడుగుతాడు. చిన్న ప్రాబ్లమ్ అని మహేంద్ర అనగానే.. శైలేంద్ర, మేనేజర్ ని పంపించు వాళ్ళు చూసుకుంటారని ఫణింద్ర చెప్తాడు. చేసేదేమీ లేక సరేనని మహేంద్ర వాళ్లని పంపిస్తాడు.
మరోక వైపు వసుధార గురించి రిషి ఆలోచిస్తూ.. కార్ డ్రైవ్ చేస్తుంటాడు. అప్పుడే వసుధార వస్తున్న ఆటోకి అడ్డంగా వస్తాడు. ఆటో డ్రైవర్ రిషినీ కోప్పడుతుంటే వసుధార ఆపుతుంది. మీరు వెళ్ళండని చెప్పి ఆటో డ్రైవర్ ని అక్కడ నుండి పంపిస్తుంది. ఏంటి సర్ మీరు ఏదో అలోచిస్తూ, ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ చెయ్యడం కరెక్ట్ కాదని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళబోతుంటే వసుధార ఆగమని చెప్తుంది. నేను డ్రైవింగ్ చేస్తానని వసుధార అడుగుతుంది. మొదట నిరాకారించిన ఆ తర్వాత రిషి ఒప్పుకుంటాడు. మరొకవైపు జగతి, మహేంద్రల దగ్గరికి మేనేజర్ వస్తాడు. ఏమైంది అని జగతి అడుగుతుంది. అకౌంట్స్ మొత్తం సీజ్ అయ్యాయి ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే చెప్పట్లేదు మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పారని మేనేజర్ చెప్పగానే.. జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఇప్పుడు అందరికి సాలరీ ఎలా ఇవ్వాలి. అందరికి అవసరాలు ఉంటాయి కదా అని జగతి అంటుంది. జగతి తన గోల్డ్ బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొని సాలరీస్ ఇద్దామని, ఆ తర్వాత అంత క్లియర్ అయ్యాక మల్లీ గోల్డ్ తీసుకోవచ్చని జగతి చెప్తుంది. దానికి మహేంద్ర కూడా సరేనంటాడు.
మరొక వైపు క్లాస్ కి రాను, మీరు లాస్ట్ క్లాస్ లో చెప్పింది చెయ్యండి అని పాండియన్ కి రిషి చెప్తాడు. మరొక వైపు ప్రిన్సిపల్ సిలబస్ గురించి రిషి తో డిస్కషన్ చేసి కలిసి వర్క్ చెయ్యండని వసుధారతో చెప్తాడు. వసుధార సరేనని రిషి క్లాస్ లో ఉన్నాడునుకొని వెళ్తుంది కానీ రిషి తన క్యాబిన్ లో ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి డిస్టబ్ చెయ్యడం ఎందుకని వసుధార వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషికి ప్రిన్సిపల్ ఫోన్ చేసి.. వసుధార మేడమ్ మీ దగ్గరికి వచ్చిందా కలిసి డిస్కషన్ చేసి చెయ్యమని చెప్పానని రిషికి చెప్తాడు ప్రిన్సిపల్.. ఆ తర్వాత వసుధార నా దగ్గరికి రాలేదని, తన దగ్గరికి వెళ్తాడు రిషి. ప్రిన్సిపల్ సర్ నన్ను కలవమని చెప్పాడంట? ఎందుకు రాలేదు ఇగోనా అని అడుగుతాడు. మీరు ఏదో డిస్టబ్ లో ఉన్నారు. ఎందుకు డిస్టబ్ చెయ్యడమని రాలేదని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |